Home  »  Bollywood News  »  'రామాయణ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మొదటి భాగంలో చూపించే ఘట్టాలు ఇవే.!

Updated : Jul 11, 2026

భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, కళ్లు చెదిరే విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ 'రామాయణ'. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టుపై యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరామునిగా నటిస్తుండగా, టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సీతమ్మ తల్లి పాత్రలో మెరిసిపోనుంది. కోలీవుడ్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. 

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సినీ ప్రియుల నిరీక్షణకు తెరదించుతూ 'రామాయణ' చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రైలర్‌ను జులై 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. 

ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయోధ్యలో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడితో కలిసి వనవాసానికి వెళ్తున్నట్లుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అద్భుతమైన విజువల్స్‌తో, హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ఈ ట్రైలర్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాను దర్శకుడు నితీశ్ తివారీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, మొదటి భాగంలో అయోధ్యలో శ్రీరాముని జననం, విశ్వామిత్ర మహర్షి వెంట రామలక్ష్మణులు వెళ్లడం, తాటక సంహారం, ప్రసిద్ధ శివదనుర్భంగం, అట్టహాసంగా జరిగే సీతారాముల కల్యాణం వంటి ఘట్టాలను చూపించబోతున్నారు. ఇక రెండో భాగంలో లంకేశ్వరుడు సీతమ్మను అపహరించడం, హనుమంతుడితో కలిసి శ్రీరాముడు సీతాన్వేషణ చేయడం, వానర సైన్యంతో కలిసి లంకపై దండెత్తడం, చివరగా జరిగే రావణ సంహారం వంటి హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను ఆవిష్కరించనున్నారు.

ఈ మైథలాజికల్ ఎపిక్ డ్రామాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే, ఆంజనేయుడిగా బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ కనిపిస్తారు. అలాగే మండోదరిగా చందమామ కాజల్ అగర్వాల్, కైకేయిగా లారా దత్తా, కౌశల్యగా ఇందిరా కృష్ణన్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమయ్యారు. 

ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ చివరి వారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే సినిమా రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి పండగకు రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జులై 24న రాబోయే ట్రైలర్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

https://www.instagram.com/p/Dao_K5Bs4gL/

Ramayana Trailer, Ranbir Kapoor, Sai Pallavi, Nitesh Tiwari

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.